News April 2, 2025

వనపర్తి: ఇది పెద్దగూడెం రామాలయం చరిత్ర…!

image

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో కోదండ రామస్వామి ఆలయాన్ని 1791లో నాటి వనపర్తి సంస్థానాధీశులు రాణి శంకరమ్మ తన భర్త రామేశ్వరరావు జ్ఞాపకార్థంగా నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. మూల విరాట్ విగ్రహాలను తమిళనాడు మఠాధిపతులు ప్రతిష్ఠించారని పెద్దగూడెం కోదండ రామాలయం ప్రధాన అర్చకులు రమణయ్య తెలిపారు.

Similar News

News April 4, 2025

వనపర్తి: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

image

పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజనుల సంక్షేమ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. వి.రజని మాట్లాడుతూ.. బాల బాలికలను వివిధ రకాలైన లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసినట్లు ఉదాహరణలతో వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

News April 4, 2025

నార్నూర్: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

image

నార్నూర్ మండలం గంగాపూర్‌లో ఎంగేజ్మెంట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2025

భూ ఆక్రమణదారులకు మంచిర్యాల కలెక్టర్ వార్నింగ్

image

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో భాగంగా కోర్టులో కొనసాగుతున్న కేసుల సంబంధిత భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

error: Content is protected !!