News April 24, 2025

వనపర్తి: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

image

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.

Similar News

News April 24, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

image

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News April 24, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్

image

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి జూన్ 5వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో కుట్లు అల్లికలు, సంగీతం, చిత్ర లేఖనం, వ్యక్తిత్వ వికాసం, చదరంగం, టీఎల్ఎంలపై శిక్షణ ఇస్తామని, ఆసక్తి గల విద్యార్థులు పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

ఈనెల 26న మహబూబాబాద్‌లో జాబ్ మేళా

image

ఈనెల 26న మహబూబాబాద్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో జిల్లాలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు టెన్త్, ఆ పైన విద్యార్హత కలిగిన పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్ఆర్ 8374054911కు సంప్రదించలన్నారు.

error: Content is protected !!