News March 26, 2025
వనపర్తి: ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త..!

> ఆరు బయట పని చేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి.> పిల్లల్ని ఎండలో ఆడనివ్వకపోవడమే మంచిది.> ఎండలో ఎక్సర్‌సైజ్‌లు చేయొద్దు.> కండరాల్లో, కడుపులో నొప్పి వస్తుంటే ఎండ వల్ల కావచ్చు.> తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లిన లేదా రంగు దుస్తులు ధరించండి. టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.> దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి.
Similar News
News April 1, 2025
అలంపురం పుణ్యక్షేత్రంలో రమణీయంగా రథోత్సవం

శ్రీశైలం మహా క్షేత్రానికి పశ్చిమ ద్వారమైన అలంపురం పుణ్యక్షేత్రంలో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం రాత్రి రథోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధల మధ్య రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి, అమ్మవారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో కూర్చో బెట్టి ఆలయం చుట్టూ ఊరేగించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి విగ్రహాలను ఆలయ ప్రాకార మండపంలో రథం ఊరేగించారు.
News April 1, 2025
పొందుర్తిలో రైతు ఆత్మహత్య

రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన స్వామి రెండు ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. బోరులో నీటిమట్టం తగ్గిపోవడంతో చేతికొచ్చే పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News April 1, 2025
ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం