News February 5, 2025
వనపర్తి: ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్.!
వనపర్తి జిల్లా సాయుధ దళ కార్యాలయం (ఆర్మ్డ్ రిజర్వ్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.రవి కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ రవికుమార్‌పై పెబ్బేరు పోలీస్ స్టేషన్‌లో ఒకే రోజు 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిర్లక్ష్యంగా, దుష్ప్రవర్తనతో వ్యవహరించిన కారణంగా కానిస్టేబుల్ రవికుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 6, 2025
MDCL:14,238 ఎకరాలకు రైతు భరోసా కట్..!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు అనుకూలంగా లేని భూముల సర్వే నిర్వహించారు. 78,261 ఎకరాల భూముల్లో 14,238 ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా లేదని గుర్తించినట్లుగా DAO చంద్రకళ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ప్రతి ఏటా ఎకరాకు రూ.12,000 చొప్పున అందిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే.
News February 6, 2025
దేవాపూర్ సిమెంట్ కంపెనీ డ్రైవర్ మృతిపై కేసు
దేవాపూర్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్ రవీందర్ సింగ్(36)మృతిపై కేసు నమోదు చేసినట్లు SI ఆంజనేయులు తెలిపారు. రవీందర్‌కు మంగళవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో తోటి ఉద్యోగులు అతడిని కంపెనీ డిస్పెన్సరీకి, అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడి భార్య మహిమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
News February 6, 2025
బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట
గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.