News April 10, 2025
వనపర్తి: కలెక్టరేట్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి ఐడీఓసీ సమావేశం మందిరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లాలోని ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, కుల సంఘాల పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News December 17, 2025
గరిడేపల్లిలో 1042 ఓట్లతో కాంగ్రెస్ మద్దతుదారు విజయం

గరిడేపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య తన ప్రత్యర్థులపై 1042 ఓట్లతో మెజార్టీతో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
News December 17, 2025
నేను పార్టీ మారలేదు.. స్పీకర్‌కు కడియం వివరణ

TG: తాను కాంగ్రెస్‌లో చేరలేదని, పార్టీ మారాననేది పచ్చి అబద్ధం అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కడియంకు నోటీసులు ఇవ్వగా రెండు రోజుల క్రితం ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల కేసులో క్లీన్‌చిట్ ఇవ్వడంతో కడియం రిప్లై బయటకు వచ్చింది. అటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రేపు నిర్ణయం తీసుకోనున్నారు.
News December 17, 2025
కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి

ముడో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయిన తరువాత కౌటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. జమ్మికుంట మండలం మాచనపల్లి, జగ్గయ్య పల్లె గ్రామంలో కౌటింగ్ ప్రక్రియను పరిశీలించినారు. అనంతరం వీణవంక మండలం రెడ్డిపల్లి, చల్లూర్, మామిడాలపల్లెలోనూ కౌటింగ్ విధానంను పర్యవేక్షించి ఈ మేరకు అధికార్లకు పలు సూచనలు చేశారు.


