News March 19, 2025

వనపర్తి జిల్లా కలెక్టర్ గమనిక 

image

ఏప్రిల్ 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే, రాబోయే ఎన్నికల్లో ఓటరుగా అవకాశం లభిస్తుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఫామ్ 6,7,8పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. 

Similar News

News March 19, 2025

వైసీపీ హయాంలో అక్రమాలపై విచారణ చేస్తాం: అచ్చెన్న

image

అవినీతి కోసమే పథకం అన్నట్లు గత వైసీపీ ప్రభుత్వ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాహనాల కొనగోళ్లు, నిర్వహణలో తప్పులు జరిగాయని తెలిపారు. వీటిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాని పేర్కొన్నారు. నివేదిక సంతృప్తిగా లేకుంటే మరో ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.

News March 19, 2025

విశాఖ: చిన్న శ్రీను కుమారుడి మృతి

image

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.

News March 19, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!