News April 4, 2025

వనపర్తి జిల్లా యువతకు పోలీసుల WARNING

image

ప్రజలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. మత్తుమందుల వ్యసనాన్ని అందరం కలిసి నిర్మూలించాలన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Similar News

News April 12, 2025

వనపర్తి: భూసేకరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి పూర్తిచేసేందుకు మిగిలిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ, భూ నిర్వాసితుల పునరావాస ఏర్పాట్ల పై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుద్ధారం పెద్ద చెరువు, గణప సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించిన భూసేకరణపై చర్చించారు.

News April 12, 2025

కేంద్ర నిధులు సమర్థవంతంగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే కడియం 

image

జనగామ కలెక్టరేట్‌లో ‘దిశ’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు వెంటనే ఇందిరమ్మ ఇళ్లను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు నాలాల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని సూచించారు.

News April 12, 2025

GHMC రికార్డు.. భారీగా TAX వసూళ్లు

image

TAX వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. బల్దియా చరిత్రలో తొలిసారి రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు అయ్యిందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పని చేశారన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు శుక్రవారం బంజారాభవన్‌లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. OTS పథకంతో మంచి ఫలితాలు వచ్చాయని, 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.2,038 కోట్లకుపైగా వసూలయ్యాయని కమిషనర్ స్పష్టం చేశారు.

error: Content is protected !!