News February 12, 2025
వనపర్తి జిల్లాకు ఐటీ టవర్ మంజూరు: చిన్నారెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362512927_52409733-normal-WIFI.webp)
వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మంజూరైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ.22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఐ టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.
Similar News
News February 13, 2025
ముప్కాల్: హైవేపై యాక్సిడెంట్ వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357965923_51151498-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వయసు సుమారు 50-60 మధ్యలో ఉంటుంది. అతను తెల్ల చొక్కా లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించలన్నారు.
News February 13, 2025
కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739379149628_1045-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.
News February 13, 2025
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364715103_51771152-normal-WIFI.webp)
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ROలు నోటిఫికేషన్ జారీ చేసిన రోజే నామినేషన్ స్వీకరించాల్సి ఉంటుందన్నారు.