News March 10, 2025
వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 40.7° ఉష్ణోగ్రత నమోదయింది. పానగల్ 40.4, విలియం కొండ 39.2, వెలుగొండ 39.0, దగడ 38.9, కేతపల్లి 38.6, పెబ్బేరు 38.4, మదనపూర్ 38.3, వనపర్తి 38.0, గోపాల్ పేట 37.8, ఆత్మకూర్ 37.8, ఘన్పూర్ 37.5, వీపనగండ్ల 37.4, శ్రీరంగాపూర్ 37.3, జానంపేట 37.3, రేవల్లి 37.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 10, 2025
లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. లైన్‌మెన్ రామారావు మృతి బాధ కలిగించిందన్నారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు.
News March 10, 2025
ITBP స్పోర్ట్స్ కోటాలో 133 ఉద్యోగాలు

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, కబడ్డీ, తదితర క్రీడా విభాగాల్లో 3/4/2023 నుంచి 2/4/2025 వరకు నోటిఫికేషన్‌లోని పేరా (4)Dలో పేర్కొన్న క్రీడల్లో మెడల్స్ సాధించి ఉండాలి. ఈ నెల 4న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News March 10, 2025
బాపట్ల పీజీఆర్‌ఎస్‌కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.