News March 5, 2025
వనపర్తి జిల్లాలో వ్యక్తి మృతి

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. హీర్లతండాకు చెందిన హరిచంద్, వాలీబాయి భార్యభర్తలు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన హరిచంద్ రాత్రి ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందనట్లు వారు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 6, 2025
నెల్లూరు: హౌసింగ్ AE సస్పెన్షన్

జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్‌రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.
News March 6, 2025
సింగిల్స్‌లో ‘కింగ్’.. కోహ్లీ

క్రికెట్‌లో సిక్సులు, ఫోర్ల కంటే ఒక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సింగిల్స్, డబుల్స్ చాలా కీలకం. ఈ విషయంలో కింగ్ కోహ్లీది అందెవేసిన చేయి. విరాట్ 301 వన్డేల్లో 14,180 రన్స్ చేస్తే అందులో సింగిల్స్ ద్వారానే 5,870 పరుగులు వచ్చాయి. 2000 JAN నుంచి ODI క్రికెట్‌లో ఓ బ్యాటర్‌కు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర(5,503), జయవర్దనే(4,789), ధోనీ(4,470), పాంటింగ్(3,916), రోహిత్(3,759) ఉన్నారు.
News March 6, 2025
ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.