News March 19, 2025

వనపర్తి: త్వరలోనే ముస్లింలకు ఇఫ్తార్ విందు..

image

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు విషయంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

Similar News

News March 20, 2025

మెదక్: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

image

మెదక్ జిల్లాలో ఈనెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పాటు త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు.

News March 20, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య.. ప.గో జిల్లా వాసి అరెస్ట్

image

అనకాపల్లి జిల్లాలో దీపు అనే ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింన విషయం తెలిసిందే. అయితే ఇరగవరం(M) పొదలాడకు చెందిన బన్నీనే ఆ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నాలుగేళ్ల నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ..గొడవలు రావడంతో హత్య చేసినట్లు సమాచారం. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ SP వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేసి కేసు చేధించారు.

News March 20, 2025

SKLM: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు

image

జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చెసుకుంటానని చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకోవాలని అడిగితే ససేమిరా అన్నాడు. మరోక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సే మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!