News April 5, 2025
వనపర్తి: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: చిన్నారెడ్డి

వనపర్తి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏటీసీ తరగతులను నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్ ఇప్పటికే ఇక్కడికి చేరింది. ఏటీసీకి అవసరమైన విధంగా భవనాన్ని సిద్ధం చేయనున్నారు. ఈ పనులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బోధన, అధ్యాపక బృందంతో ఆయన మాట్లాడారు.
Similar News
News April 5, 2025
అణగారిన వర్గాల హక్కులకై జగజ్జీవన్ రామ్ పోరాడారు: గవర్నర్

దేశ మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనకు ఘననివాళి అర్పించారు. ఈ మేరకు విజయవాడలోని రాజ్‌భవన్ నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలు, అణగారిన వర్గాల హక్కులకై జగజ్జీవన్ రామ్ పోరాడారని గవర్నర్ వ్యాఖ్యానించారు. సామాజికన్యాయం, సమానత్వ సాధనకు జగజ్జీవన్ రామ్ అమితంగా కృషి చేశారని కొనియాడారు.
News April 5, 2025
జగిత్యాల నుంచి TPCC సేవాదళ్ సెక్రటరీగా ముకేశ్ ఖన్నా

జగిత్యాల పట్టణానికి చెందిన బోగోజీ ముకేశ్ ఖన్నాను TPCC సేవాదళ్ సెక్రటరీగా నియమించారు. 2007 నుంచి కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUIలో ఉన్న ముకేశ్‌కు జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పదవి లభించడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియామకం పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.
News April 5, 2025
అల్లూరి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ

అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరిపేటకి చెందిన ఓ మహిళ కాన్పు కోసం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. అనంతరం అదృశ్యమైంది. ఆమెను కాకినాడ పోలీసులు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌లో తనకు పుట్టిన పిల్లలను ఎవరో ఎత్తుకుపోయారని ఆమె చెప్పింది. గట్టిగా విచారించడంతో 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.