News April 21, 2025
వనపర్తి: నాలుగు కేంద్రాల్లో స్వల్ప వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు 8:30 వరకు) నాలుగు కేంద్రాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. చిన్నంబావిలో 9.0 మిల్లీమీటర్లు, రేవల్లిలో 6.2 మిల్లీమీటర్లు, కొత్తకోటలో 3.4 మిల్లీమీటర్లు, గోపాల్‌పేటలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. మిగిలిన 10 కేంద్రాల్లో జీరో వర్షపాతం నమోదైంది.
Similar News
News April 21, 2025
BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

AP: గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
News April 21, 2025
ప్రజల ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: BHPL ఎస్పీ

ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, సామాన్యులు నిర్భయంగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు అందజేయాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్‌లో భాగంగా 18 మంది బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబధిత అధికారులను ఆదేశించారు.
News April 21, 2025
VZM: 18 మందికి రూ.63లక్షల రుణాలు

విజయనగరం కలెక్టరేట్లో 18 మంది దివ్యాంగులకు రూ.63 లక్షల విలువగల రుణాలను కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం పంపిణీ చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్‌గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు 29 ల్యాప్టాప్‌లు, మూగ, చెముడు అభ్యర్థులకు ఆరు టచ్ ఫోన్లు, ట్రై సైకిళ్లను అందజేశారు.