News April 16, 2025
వనపర్తి: నేషనల్ హెరాల్డ్ కేసుపై ధర్నాలు చేయాలి: రాజేంద్రప్రసాద్

నేషనల్ హెరాల్డ్‌లో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీపై బీజేపీ, మోదీ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని, AICC, TPCC పిలుపుమేరకు ఏప్రిల్ 17న అన్ని జిల్లా, మండలాలు, మున్సిపాలిటీల్లో వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని DCC అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ఫొటోలు, వీడియోలు పంపాలన్నారు.
Similar News
News April 20, 2025
నెల్లిమర్ల ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.
News April 20, 2025
AMP: జిల్లాలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు

కోనసీమ జిల్లాలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నామని డీఈవో షేక్ సలీం భాష తెలిపారు. ఆయన అమలాపురం నుంచి శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆసక్తి కలిగిన వారు 26వ తేదీలోపు వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News April 20, 2025
చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.