News March 22, 2025
వనపర్తి: ప్రతి ఒక్క దివ్యాంగుడికి యూనిక్ డిజేబుల్ ఐడీ: కలెక్టర్

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూనిక్ డిజేబుల్ ఐడీని అమల్లోకి తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News December 13, 2025
విశాఖ వ్యాప్తంగా 336 దుకాణాల తొలగింపు

విశాఖలోని 8 జోన్లలో రహదారిపై ఆక్రమణల తొలగింపును జీవీఎంసీ శనివారం చేపట్టింది. తగరపువలస, బోయపాలెం, సమతా కాలేజీ, లీల మహల్, కంచరపాలెం, గాజువాక, శ్రీనగర్, సుజాతనగర్ ప్రాంతాల్లో రహదారులపై ఉన్న 336 దుకాణాలను ‘ఆపరేషన్ లంగ్స్’ పేరిట తొలగించామని చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల మేరకు తొలగింపులు చేపడుతున్నామని చెప్పారు.
News December 13, 2025
ధర్మారం: పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ

ధర్మారం మండలంలో జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News December 13, 2025
ఎంజీఎంలో కానరాని పెస్ట్ కంట్రోల్!

వరంగల్ MGM ఆసుపత్రిలో శానిటేషన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు. వార్డుల్లో అపరిశుభ్రత కారణంగా చెత్తా చెదారంతో ఎలుకలకు నివాస కేంద్రంగా మారిందంటున్నారు. రోగుల బెడ్లపైకి చేరి చేతులను కొరికే వరకు చేరిందంటే MGMలో శానిటేషన్ ఏ మేర ఉందో తెలుస్తోంది. నల్లబెల్లి(M) నందిగామకు చెందిన <<18554300>>భరత్ అనే రోగి ఉంగరం వేలును<<>> ఎలుక కొరికిన విషయం తెలిసిందే.


