News March 24, 2025
వనపర్తి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాలలకు తీరని అన్యాయం’

రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి మాలలకు సంక్షేమ పథకాల్లో, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్‌లో తీరని అన్యాయం జరిగిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాదారి భోజరాజు అన్నారు. మాలలకు ప్రతి సంక్షేమ పథకంలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికు వినతి పత్రం అందించారు. మద్దిలేటి వెంకటేశ్, కురుమూర్తి, కరుణాకర్ పాల్గొన్నారు.
Similar News
News March 29, 2025
వనపర్తి: రాజీవ్ యువ వికాసానికి అర్హతలు ఇవే.!

✓ గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.2 వార్షికాదాయం ఉన్నవారు అర్హులు.✓ దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువపత్రం వివరాలను ఇవ్వాలి. ✓ వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21-55 సంవత్సరాల మధ్య ఉండాలి. ✓ వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి.✓ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత.
News March 29, 2025
పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నటి

నటి అభినయ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. సినీ అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. పుట్టుకతో చెవిటి, మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
News March 29, 2025
నాగర్‌కర్నూల్: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఇచ్చిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, బిజ్నిపల్లి, తాడూరు మండలాలకు చెందిన CMRF, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 133 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే Dr.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు.