News February 24, 2025

వనపర్తి: బాల్యవివాహాల అడ్డకట్టకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. P.M మోదీ 2015 జనవరి 22న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే 1098 కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News February 25, 2025

WPL: యూపీ ‘సూపర్’ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో జరిగిన తొలి సూపర్ ఓవర్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 9 రన్స్ టార్గెట్‌‌తో బరిలోకి దిగిన ఆర్సీబీని ఆ జట్టు 4 పరుగులకే కట్టడి చేసింది. యూపీ బౌలర్ సోఫీ ఎకిల్‌స్టన్ సూపర్ ఓవర్‌లో కేవలం 4 పరుగులే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన సోఫీ 19 బంతుల్లో 33 రన్స్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకొచ్చారు.

News February 25, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

✓ గుడ్ న్యూస్…రేపు ఖమ్మంలో జాబ్ మేళా✓ ఏన్కూరు: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు✓ మధిర:డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి✓ఖమ్మం నారాయణ కాలేజ్ వద్ద పీడీఎస్యూ ఆందోళన✓ కల్లూరు: తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు✓ ఖమ్మం: మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి: సీపీ✓ఖమ్మం: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కేఎంసీ కమిషనర్✓ స్టూడెంట్‌గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్

News February 25, 2025

మేడ్చల్: టీచర్లకు కలెక్టర్ కీలక సూచనలు..

image

పదవ తరగతి తరువాత ఏ దిశగా వెళ్లాలనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా మార్గనిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు చేయూతనందించేలా అన్ని పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. సోమవారం కూకట్‌పల్లి మండలం ఎల్లమ్మబండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయనతో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.

error: Content is protected !!