News April 3, 2025
వనపర్తి బిడ్డ అనూష తగ్గేదేలే..!

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అనకాయపల్లి పంచాయతీ పరిధి పిల్లిగుండ్ల తండాకు చెందిన ఇస్లావత్ అనూష వికారాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో ఎంపికై, బిహార్లో జరిగిన జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో అనూషను శాలువాతో సత్కరించి అభినందించి మాట్లాడారు. గ్రామీణ విద్యార్థులకు అనూష స్ఫూర్తి కావాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.
Similar News
News April 4, 2025
మహబూబాబాద్‌లో ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’

మహబూబాబాద్ జిల్లాలోని DFO ఆఫీసులో “అమ్మ పేరు మీద ఒక చెట్టు” పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొని చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలపై అమ్మపై చూపించే చూపించాలని పేర్కొన్నారు.
News April 4, 2025
రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉంది: మంత్రి సంధ్యారాణి

AP: వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. మాజీ మంత్రి రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడినందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. రెడ్‌బుక్ పేరు చెబితేనే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని సంధ్యారాణి అన్నారు.
News April 4, 2025
కూర్మన్నపాలెంలో 100 కేజీల గంజాయి పట్టివేత

గాజువాక సమీపంలో గల కూర్మన్నపాలెం వద్ద అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులో ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్ తరలించేందుకు 44 బ్యాగుల్లో సిద్ధంగా ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ చెందిన నలుగురు ముఠా పరారు కాగా.. భగత్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు దువ్వాడ పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి 100 కేజీల వరకు పోలీసులు వెల్లడించారు.