News February 13, 2025
వనపర్తి: మన ఇసుక వాహనం ద్వారానే ఇసుకను పొందాలి: జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739448504226_18811291-normal-WIFI.webp)
వనపర్తి జిల్లాలో ఇసుక అవసరం ఉన్నవారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలనీ, దళారులను ఆశ్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభీ తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ రూమ్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజల అవసరం మేరకు మన ఇసుక వాహనం ద్వారా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739454684777_51903568-normal-WIFI.webp)
బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739476900447_893-normal-WIFI.webp)
AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.
News February 14, 2025
రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకం: డీపీవో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739452880731_18976434-normal-WIFI.webp)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకమని జిల్లా పంచాయతి అధికారి నారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి, కాటారం డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.