News April 16, 2025
వనపర్తి: లెక్చరర్‌కు బ్రెయిన్ స్టోక్.. చిన్నారెడ్డి పరామర్శ

వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన సుదర్శన్ అడ్డాకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సుదర్శన్ బ్రెయిన్ స్టోక్‌కు గురి కావడంతో నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మంగళవారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించారు.
Similar News
News April 16, 2025
ఇక టోల్ గేట్లు ఉండవు: మంత్రి

జాతీయ రహదారులపై ఉండే టోల్‌గేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాలు నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
News April 16, 2025
KMR: నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరా: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో నీటి సరఫరాకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
News April 16, 2025
చైనా వస్తువులపై 245% టారిఫ్: US

అమెరికా-చైనాల మధ్య సుంకాల యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా వస్తువులపై సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం 145 శాతం నుంచి 245 శాతానికి పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు USలో విపరీతంగా పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లు చైనా వస్తువులను కొనడం ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు విపరీతంగా నష్టపోతాయి. కాగా అమెరికా వస్తువులపై చైనా 125% టారిఫ్స్ విధిస్తోంది.