News March 20, 2025

వనపర్తి: వృద్ధాప్య తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి: వి.రజని

image

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తిలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారి సంరక్షణకు హెల్ప్ లైన్ నంబర్ 14567ను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 22, 2025

జగిత్యాల: హిందీ పరీక్షకు 8 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పదోతరగతి రెండోరోజు హిందీ పేపర్ రెగ్యులర్‌కు 11,849 విద్యార్థులకు 11,841 విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యూలర్ విద్యార్థుల హాజరుశాతం 99.93% సప్లిమెంటరీ విద్యార్థులు 4 విద్యార్థులకు 3 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరుశాతం 75% అని అధికారులు తెలిపారు.

News March 22, 2025

కృష్ణా: 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% హాజరు 

image

కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 5,581 మంది విద్యార్థులకు గాను 5,571 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్టు డీఈఓ తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ టీములు పరిశీలించగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. 

News March 22, 2025

విశాఖ: కారుణ్య నియామక పత్రాలు అందించిన కలెక్టర్

image

ఏపీఎస్‌ ఆర్టీసీలో పని చేస్తూ చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యులకు శనివారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ శాఖలలో కారుణ్య నియామక పత్రాలు అందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఉన్నారు.

error: Content is protected !!