News February 13, 2025

వనపర్తి: ‘వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి’

image

బాలలను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉందని వనపర్తి జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. బాలల బెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ న్యాయమిషన్ వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రజిని మాట్లాడుతూ.. బాండడ్ లేబర్‌కు వ్యతిరేకంగా ఈమాసంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Similar News

News February 13, 2025

గొడవలకు వైసీపీ ప్లాన్ చేస్తోంది: చింతమనేని

image

AP: మాజీ MLA అబ్బయ్య చౌదరి డ్రైవర్‌‌ను <<15445652>>తిట్టారని<<>> తనపై YCP ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో MLA చింతమనేని ప్రభాకర్ స్పందించారు. ‘నా కారుకు ఎదురుగా కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అబ్బయ్య చౌదరి దగ్గరుండి కారు అడ్డు పెట్టించారు. నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని YCP ప్లాన్ చేస్తోంది. ఈ ఘటనను CM, Dy.CM దృష్టికి తీసుకెళ్తా. పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు’ అని చెప్పారు.

News February 13, 2025

HYD: ప్రభాకర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు

image

గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో బత్తుల ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు ప్రభాకర్‌‌ను ప్రశ్నించేందుకు గచ్చిబౌలి పోలీసులు 3మ రోజులు కోర్టు అనుమతి తీసుకున్నారు. కాగా.. ప్రభాకర్ విచారణలో పలు కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.

News February 13, 2025

HYD: పాఠాలు చెబుతూ.. అనుకున్నది సాధించా: SI

image

మొయినాబాద్‌ SI (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. ‘నా విజయం.. నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని వివరించారు.

error: Content is protected !!