News April 15, 2025

వనపర్తి: వేలిముద్రలు పడటం లేదని బియ్యం ఇవ్వడం లేదు: బుచ్చమ్మ

image

చేతి వేలిముద్రలు కంప్యూటర్‌లో పడటం లేదని రేషన్ షాపులో ఉచిత బియ్యం ఇవ్వటం లేదని పానగల్ మండలం కేతేపల్లికి చెందిన తెలుగు బిచ్చమ్మ తెలిపారు. రేషన్ కార్డులో తన ఒక్క పేరే ఉందన్నారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు చెరిగిపోయాయని చెప్పారు. కంప్యూటర్లో వేలిముద్రలు నమోదు అయితేనే బియ్యం వస్తాయని చెబుతూ, కొన్నాళ్లుగా ఇవ్వటం లేదని బియ్యం ఇప్పించాలని, అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 16, 2025

MDCL: ఈ ఆసుపత్రుల్లో టెలీ మెడిసిన్ సర్వీస్

image

MDCL జిల్లాలో టెలీ మెడిసిన్ సర్వీస్ అందుబాటులో ఉన్న ఆసుపత్రుల లిస్ట్ విడుదలైంది. కీసర, జవహర్ నగర్, కుషాయిగూడ, శ్రీరంగవరం, నారపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్ వీహెచ్సీలతో పాటు, మచ్చ బొల్లారం, సుభాష్ నగర్, పర్వతానగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ హంసపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం UPHCల్లో అందుబాటులో ఉంది.

News April 16, 2025

ADB: విద్యార్థులపై విష ప్రయోగం.. ఒకరి అరెస్టు: SP

image

ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై <<16115277>>విషప్రయోగం<<>> చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగుమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.

News April 16, 2025

అనారోగ్యం భరించలేక యువకుడి ఆత్మహత్య

image

TG: మంచిర్యాల జిల్లాకు చెందిన చెల్మాటికారి అనిల్‌ను గత కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిళ్లలు, వైరల్ ఫీవర్ వేధిస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గలేదు. దీంతో క్షమించమంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతికందొచ్చిన బిడ్డను కోల్పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

error: Content is protected !!