News April 12, 2025
వనపర్తి: హనుమాన్ జయంతికి పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ గిరిధర్

హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు, ప్రజలు సంతోషంగా శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఇతర మతస్థులను గౌరవిస్తూ తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని అన్నారు.
Similar News
News April 19, 2025
గుంటూరు: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల జోరు

జేఈఈ మెయిన్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఏపీ నుంచి జి.సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి ఫిమేల్ కేటగిరీలో దేశస్థాయిలో టాపర్‌గా నిలిచింది. ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకుతో మెరిసింది. మొత్తం 100లోపు 16 మంది, 200లోపు 28, 500లోపు 60, 1000లోపు 82 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని శనివారం గుంటూరులో భాష్యం ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. 73.24% సక్సెస్ రేటు సాధించామన్నారు.
News April 19, 2025
NZB: సన్న బియ్యం లబ్ధిదారులతో మైనారిటీ కమిషన్ ఛైర్మన్ భోజనం

నిజామాబాద్ గౌతంనగర్‌లో సన్న బియ్యం లబ్ధిదారుడైన లింబాద్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి: హోం మంత్రి

గంజాయి మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని పోలీస్ అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శనివారం గుంటూరు రేంజ్ పరిధిలో గుంటూరు ఐజీ కార్యాలయంలో శనివారం శాంతిభద్రతలు పరిరక్షణ ట్రాఫిక్ నిబంధనలు మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి ఎక్స్ లో పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.