News February 25, 2025

వరంగల్: 75 వేలకు పైగా మిర్చి బస్తాలు రాక

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు వరంగల్ మార్కెట్‌కు సెలవులు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం మార్కెట్‌కి రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మిర్చి ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 25, 2025

నెల్లూరు: ఈ బాల్యం బడి బాట పట్టేనా..?

image

బడి ఈడు గల పిల్లలందరూ బడిలో ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ వద్దు, బడిబాట పట్టాల్సిన చిన్నారులు, పని బాట పట్టకూడదని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. దుత్తలూరు మండలంలో పలువురు చిన్నారులు చెత్త కాగితాలు ఏరుకుంటూ, మరికొందరు బట్టీల వద్ద, క్రషర్ల వద్ద తమ బాల్యాన్ని ధారపోస్తున్నారు. వీరిని బడిబాట పట్టించాలని పలువురు కోరుతున్నారు.

News February 25, 2025

విశాఖ: ఈనెల 27న పారిశుద్ధ్య కార్మికులకు సెలవు

image

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున కార్మికులు విధులకు హాజరై యథావిధిగా వ్యర్థాలను సేకరిస్తారని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేశ్ తెలిపారు. దీంతో వారికి ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించారు. నగర ప్రజలు ఫిబ్రవరి 27వ తేదీన వ్యర్థాలను వీధులలో, బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ బిన్లలో పడేయవద్దని సూచించారు. ఫిబ్రవరి 28న(శుక్రవారం) పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేయాలన్నారు.

News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!