News April 24, 2024
వరంగల్ BRS అభ్యర్థిపై ఎలాంటి కేసులు లేవు!
వరంగల్ పార్లమెంట్ BRS అభ్యర్థి మరపల్లి సుధీర్‌కుమార్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పొందుపర్చారు. ఆయన కుటుంబానికి రూ.2.04 కోట్ల ఆస్తులు ఉండగా.. టాటా జెస్ట్ కారు, 8తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. హన్మకొండలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల వ్యవసాయేతర భూమితో పాటు.. ఒక ఇల్లు ఉంది. మొత్తం 1.79 కోట్ల స్థిరాస్తులుండగా.. ఈయనకు ఎలాంటి అప్పులు, క్రిమినల్ కేసులు లేవు.
Similar News
News February 5, 2025
WGL: సమగ్ర సమాచారంతో బడ్జెట్ రూపకల్పన
సమగ్ర సమాచారంతో బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. బడ్జెట్ 2025-26 రూపకల్పనపై వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్లో రూపొందించడంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అందరి సహకారంతో బడ్జెట్ రూపొందించాలని, మున్సిపల్ చట్టం-2019 ప్రకారం బడ్జెట్ మొత్తం నుంచి 10% గ్రీన్ బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు.
News February 5, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. గీసుకొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వసతి గృహానికి తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచికరంగా లేదని, గుడ్లు ఉడకని అందిస్తున్నారని తెలిపారు.
News February 5, 2025
MHBD: వైద్యం వికటించి యువకుడు మృతి
తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.