News March 20, 2025
వరంగల్: GREAT.. తండ్రి కల నెరవేర్చిన పేదింటి బిడ్డ!

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మౌనిక భద్రాద్రి జోన్‌లో 9వ ర్యాంకుగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగం కచ్చితంగా సాధించాలని కన్న తండ్రి కలను ఎట్టకేలకు కూతురు నెరవేర్చింది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మౌనిక సగృహానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 21, 2025
మహబూబ్‌నగర్‌లో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. న్యూటన్ అమృత ప్రైవేట్ హాస్పిటల్ గల్లీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని MBNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
News March 21, 2025
మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్

నెలాఖరులోపు మినీ గోకులాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కి వివరించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఫార్మ్ ఫండ్ ఏర్పాట్లు, సీసీ రోడ్ల నిర్మాణాల పురోగతి, గోకులంల నిర్మాణాల పురోగతిపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1200 లక్ష్యానికి 664 పూర్తి చేసామని కలెక్టర్ వివరించారు.
News March 21, 2025
అర్హత లేని డాక్టర్లు అబార్షన్లు చేస్తే చర్యలు: DMHO

కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం హనుమకొండ జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు, బ్రూణ హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో ప్రత్యేక బృందం ద్వారా తనిఖీలు చేస్తున్నామని DMHO అప్పయ్య అన్నారు. నిభంధనలకు లోబడి ఇద్దరు డాక్టర్ల సమక్షలో అబార్షన్స్ చేయాలని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు అబార్షన్స్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.