News March 3, 2025
వరంగల్: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494
Similar News
News March 4, 2025
జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

మార్చి8న జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు ఇదొక సువర్ణావకాశం. పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసుల్లో, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కేసులు నమోదు చేసుకొని పంతాలకు పోకుండా రాజీపడే కేసుల్లో కక్షిదారులు రాజీపడి అన్నదమ్ముల్లా మెలగాలన్నారు. రాజీమార్గమే రాజమార్గమని పేర్కొన్నారు.
News March 4, 2025
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన జిల్లా బిడ్డలు

పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పెద్ది లక్ష్మణ్-గౌతమిల కుమార్తె హర్షిణి, కుమారుడు ఉజ్వల్ కరాటే విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. చెన్నైలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించింది. అందులో పాల్గొని తమ ప్రతిభతో గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్స్ సాధించారు. గిన్నిస్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు.
News March 4, 2025
భువనగిరి: మంత్రిని కలిసిన బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

హైదరాబాదులో బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. CM రేవంత్ రెడ్డితో చర్చించి.. చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారన్నారు. రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.