News March 28, 2025
వరంగల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. పర్వతగిరి మండలానికి చెందిన వెంకన్న అప్పుల బాధతో వరంగల్ ఓ సిటీ మైదానంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్టర్ పోలీసులు గమనించి అతన్ని అడ్డుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 2, 2025
రాయపర్తి: ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించండి: ఎమ్మెల్యే

రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం అందేలా నిరంతరం పనిచేస్తున్నామని, ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
News April 2, 2025
వరంగల్: GREAT.. గ్రూప్-1 ఆఫీసర్‌గా వాచ్మెన్ కుమారుడు

వరంగల్ జిల్లాకు చెందిన వాచ్మెన్ కుమారుడు గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. మామునూరుకు చెందిన జయ-రవికుమార్ దంపతుల కుమారుడు రాహుల్ ఇటీవల TGPSC విడుదల చేసిన గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 555వ ర్యాంక్, మల్టీ జోన్-1 SC కేటగిరీలో 23వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 2023-2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏవో, జేఏఓ ఎగ్జామ్‌లో రాహుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ)గా ఎన్నికయ్యారు.
News April 1, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం మంగళవారం రంజాన్ సందర్భంగా సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.