News February 25, 2025
వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.
Similar News
News December 19, 2025
విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈనెల 22న మాక్‌డ్రిల్

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగాఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈనెల 22వ తేదీన చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టే మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు తక్షణ చర్యలపై సన్నద్ధత కోసం ఈమాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 19, 2025
NTR: జిల్లా విద్యాశాఖ అధికారిణిగా ఎల్. చంద్రకళ

ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారిణిగా ఎల్. చంద్రకళ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో STU జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. జార్జ్ వాషింగ్టన్, సభ్యులు, జిల్లా విద్యాశాఖ అధికారిణి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో అభినందనలు తెలియజేశారు. ఏ. కొండూరు మండలంలోని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని, వారు కోరారు.
News December 19, 2025
సంగారెడ్డి: రేపు ఫుడ్ లైసెన్స్ మేళా

ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళాను శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ఫుడ్ ఇన్స్ పెక్టర్ నారాయణఖేడ్‌లోని వెంకటేశ్వర థియేటర్‌లో ఉదయం 10 గంటల నుంచి మేళా జరుగుతుందని చెప్పారు. వ్యాపారులు ఆహార లైసెన్సుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.


