News February 25, 2025
వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.
Similar News
News February 25, 2025
బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య (UPDATE)

బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామానికి చెందిన తల్లి ఎల్లమ్మ (58), కొడుకు మొగులప్ప (36)ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. కోడలే హత్యకు కారణమా.? హత్య చేసి!ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరిగిందా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్థానికులు కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.
News February 25, 2025
రాజీనామా చేసిన నహీద్.. త్వరలో కొత్త పార్టీ!

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ అడ్వైజర్ మహమూద్ యూనస్‌కు అందజేశారు. నహీద్ సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢాకా యూనివర్సిటీకి చెందిన ఇతడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించారు. నహీద్ నాయకత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.
News February 25, 2025
బండి విజ్ఞతతో మాట్లాడాలి: టీపీసీసీ చీఫ్

TG: కాంగ్రెస్ పార్టీని పాకిస్థాన్ టీమ్‌తో పోల్చుతూ కేంద్ర మంత్రి <<15574950>>బండి సంజయ్<<>> చేసిన వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు. రాజకీయాలను క్రికెట్‌ను ముడిపెట్టకుండా విజ్ఞతతో మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర రాజకీయాలు తెలియకుండా మాట్లాడొద్దని మండిపడ్డారు. గత పదేళ్లలో BRS చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు.