News April 14, 2024
వరంగల్: కాకతీయుల సమాచారం.. క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం

కాకతీయుల కట్టడాలున్న ఖిలా వరంగల్ కోట సమాచారంతో పాటు కాకతీయుల చరిత్రను పర్యాటకులకు డిజిటల్ విధానంలో అందించేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈమేరకు కాకతీయుల చరిత్రను క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేసి బోర్డులను ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో కట్టడాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Similar News
News April 21, 2025
పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
News April 20, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ CP సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుల్ రాజు ఓ కేసు విషయంలో నిందితుడికి సహకారం అందించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువవడంతో వారిని సస్పెండ్ చేశారు.
News April 20, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.