News February 7, 2025

వరంగల్ ‘కారు’ స్టీరింగ్ పోస్టు ఖాళీ..!

image

వరంగల్ జిల్లా BRS అధ్యక్ష పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరూరి రమేష్ పార్టీని వీడారు. ఆ తర్వాత కారు స్టీరింగ్‌ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. కీలకమైన జిల్లా అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండడంతో నియోజకవర్గాల్లో నేతలు అంతంతమాత్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు.

Similar News

News December 17, 2025

గొల్లభామ తండా సర్పంచ్‌గా బాలు నాయక్

image

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News December 17, 2025

వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

image

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్‌లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

image

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.