News February 13, 2025

వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News February 14, 2025

సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 6మందికి జరిమానా

image

సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్నిరోజుల క్రితం వాహనాల తనిఖీ నిర్వహించారు. 6మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేశారు. మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా న్యాయమూర్తి కాంతారావు ముందు గురువారం హాజరుపరచగా 6 మందికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.

News February 14, 2025

బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

image

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News February 14, 2025

వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

image

AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.

error: Content is protected !!