News September 25, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,500

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో కొద్ది రోజులుగా పత్తి ధరలు మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. గత శుక్రవారం క్వింటా పత్తి రూ.7,825 పలకగా, సోమవారం రూ.7,650 కి పడిపోయింది. నేడు మరింత తగ్గి రూ.7500కి చేరినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News September 29, 2024

స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క

image

నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణు దేవవర్మ, సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం పలువురు విద్యార్థులతో మంత్రి సీతక్క మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 28, 2024

తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

image

తపాస్ పల్లి రిజర్వాయర్ ను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సందర్శించి నీటిని విడుదల చేశారు. రైతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, దేశానికి వెన్నెముక రైతు అని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News September 28, 2024

తాపడం పనులను ప్రారంభించాలి: మంత్రి సురేఖ

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతినిచ్చారని, వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతను M/s స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ పనులను బ్రహ్మోత్సవాల నాటికి ముందే 2025 మార్చిలోపే పూర్తిచేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.