News March 29, 2025

వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

image

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.

Similar News

News December 16, 2025

లిస్టులోకి మరో 19మంది ప్లేయర్లు.. నేడే మినీ వేలం

image

IPL మినీ వేలం లిస్టులో అభిమన్యు ఈశ్వరన్‌తో సహా 19 మంది ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్‌లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని BCCI తెలిపింది. నేడు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ 2.30PM నుంచి అబుదాబిలో ఆక్షన్ ప్రారంభం కానుంది. KKR పర్సులో అత్యధికంగా రూ.64.30CR ఉన్నాయి.

News December 16, 2025

పెద్దపల్లి జిల్లాలో పూర్తిస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు

image

PDPL జిల్లా గ్రామ పంచాయతీ 3వ దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలిగేడు, ఓదెల, PDPL, సుల్తానాబాద్ మండలాల్లో 128 పోలింగ్ అధికారులు, 166 అసిస్టెంట్ పోలింగ్ అధికారులను రిజర్వ్‌తో సహా నియమించారు. వీరికి DEC 12న శిక్షణ పూర్తయింది. 1,44,563 ఓట్లకు గాను 1,37,335 ఓటర్ల స్లిప్‌లు పంపిణీ కాగా, 7,228 స్లిప్‌లు ఇంకా మిగిలి ఉన్నాయి.

News December 16, 2025

నేడే ‘విజయ్ దివస్’.. ఎందుకు జరుపుకుంటారు?

image

DEC 16, 1971. ఇది పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. PAK సైన్యాధిపతి AAK నియాజీ 93వేల మంది సైనికులతో ఢాకాలో భారత్‌కు లొంగిపోతారు. పాక్ ఓడిపోయి తూర్పు పాకిస్థాన్ స్వతంత్ర ‘బంగ్లాదేశ్‌’గా ఏర్పడింది. ఈ విజయానికి గుర్తుగా ‘విజయ్ దివస్’ జరుపుకుంటున్నాం. 1971లో తూర్పు పాకిస్తాన్‌లో పాక్ ఆధిపత్యం, ఆంక్షలతో మొదలైన స్వతంత్ర పోరు క్రమంగా భారత్-పాక్ యుద్ధానికి దారితీసింది.