News April 16, 2025
వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్‌కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News April 16, 2025
NLG: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.
News April 16, 2025
41 రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీ: జేసీ కార్తీక్

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.
News April 16, 2025
కష్టపడి చదివితే ఇష్టమైన జీవితం: భద్రాద్రి కలెక్టర్

విద్యార్థి దశలో కష్టపడి చదివితే ఇష్టమైన జీవితం మన చేతిలోకి వస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసి మాట్లాడారు. కళాశాలలో నిష్ణాణితులైన అధ్యాపక బృందం విశాలమైన తరగతి గదులు క్రీడా ప్రాంగణంతో అన్ని వసతులు కలిగి ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.