News March 31, 2025
వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News April 5, 2025
ప్రేమ పేరుతో మోసం.. 4 పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్య జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది. మార్చి 24న పెళ్లి జరగ్గా, మరుసటి రోజే వాటితో పరారైంది. శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే 3పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని తెలిసింది.
News April 5, 2025
సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ వివరాలు.. గరిడేపల్లి మండలం కల్మల్‌చుర్వు గ్రామానికి చెందిన సైదులు(53) హనుమంతులగూడెంకి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘనటలో సైదులు స్పాట్‌లోనే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2025
సమసమాజ స్థాపన కోసం తపించిన బాబూజీ

బాబు జగ్జీవన్ రాం బిహార్‌లోని చంద్వాలో 1908లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కుల వివక్షపై పోరాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, స్వాతంత్య్రం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారు. కేంద్రంలో 30 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. ఉపప్రధానిగా పని చేశారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన ఆయన దళితుల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం పోరాడారు. నేడు జగ్జీవన్ రాం 117వ జయంతి.