News April 6, 2025

వరంగల్: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

image

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఈ నెల 11న టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా పోస్టరును కలెక్టర్ సత్య శారదా దేవి, మేయర్ గుండు సుధారాణితో మంత్రి సురేఖ శనివారం ఆవిష్కరించారు. జిల్లాలో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

Similar News

News April 8, 2025

వరంగల్: దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష 

image

వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007, నియమావళి రూల్స్ 2011 అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. వయో వృద్ధులు, వికలాంగులకు సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.

News April 8, 2025

MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.

News April 8, 2025

కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

error: Content is protected !!