News February 28, 2025
వరంగల్: దశాబ్ద కాలం కోరిక నెరవేరింది: మంత్రి సురేఖ

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నెరవేరిందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సీఎం రేవంత్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు.
Similar News
News March 1, 2025
ట్రంప్‌తో గొడవ.. జెలెన్‌స్కీకి మద్దతుగా EU దేశాలు

ట్రంప్, జెలెన్‌స్కీ గొడవ నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ ప్రజలు ఒంటరి కాదంటూ EU దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈమేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సహా పలు దేశాల ప్రధానులు, యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కాజా కల్లాస్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్రంప్, EU మధ్య ‘సుంకాల’ వార్ నడుస్తుండగా తాజా గొడవ ఎక్కడికి దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.
News March 1, 2025
ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
News March 1, 2025
ఎగుమతి పెంచేందుకు కృషి: కడప కలెక్టర్

కడప జిల్లాలో పారిశ్రామిక, ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు.