News March 7, 2025

వరంగల్ నగరంలో పోలీసుల పుట్ పెట్రోలింగ్

image

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భరోసా కల్పించే దిశగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వరంగల్ డివిజినల్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ నేతృత్వం పోలీసులు మండిబజార్, చార్ బోలి ప్రాంతాల్లో పుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.

Similar News

News March 9, 2025

ముంబై జట్టులోకి ఆల్‌రౌండర్

image

గాయంతో ఐపీఎల్ 2025కు దూరమైన లిజాడ్ విలియమ్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. 2014లో U19 WC గెలిచిన సఫారీ టీమ్‌లోని కార్బిన్ బాష్‌ను జట్టులోకి తీసుకున్నట్లు MI ట్వీట్ చేసింది. కాగా 86 టీ20లు ఆడిన కార్బిన్ 59 వికెట్లు తీయగా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పటికే ముంబై జట్టులో హార్దిక్ పాండ్య, సాంట్నర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు.

News March 9, 2025

భద్రాచలం రాములవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 

image

భద్రాచలం రాములవారి బ్రహ్మోత్సవాల ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్నాయి. 30న కల్పవృక్ష వాహన సేవ, 31, ఏప్రిల్ 1 తిరువీధి సేవలు, 2 గరుడ పట లేఖనం, 3 భద్రకమండలం లేఖనం, 4 అగ్ని ప్రతిష్ఠ, ద్వజారోహణం, 5 చతుఃస్థానార్చన, ఎదుర్కోలు, 6 కళ్యాణం 7 పట్టాభిషేకం, 8 సదస్యం,హంస వాహన సేవ, 9 తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వ వాహన సేవ, 10 సింహ వాహన సేవ, 11 వసంతోత్సవం, గజవాహన సేవ, 12 చక్రతీర్ధం,పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

News March 9, 2025

సిరియాలో ప్రతీకార దాడులు.. 600 మంది మృతి!

image

సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో భద్రత దళాలు, మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారుల మధ్య ప్రతీకార దాడుల్లో 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇరు వర్గాల మధ్య దాడి మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటన ఇదేనని తెలిపాయి. వీధుల్లో, భవనాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బనీయాస్ పట్టణంలో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించాయి.

error: Content is protected !!