News February 28, 2025
వరంగల్: నర్సంపేటలో విషాదం.. BRS నేత మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాణాల రాంబాబు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడని స్థానికులు తెలిపారు. రాంబాబు భార్య ఇందిర 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. రాంబాబు మృతిపై స్థానికులు, పట్టణ బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు నివాళులర్పించారు.
Similar News
News December 15, 2025
NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టీపుల్ డిజబిలిటీస్ (<
News December 15, 2025
నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రి లోకేశ్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. 8.30AMకు హస్తినకు చేరుకోనున్న ఆయన నేరుగా పార్లమెంట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ఏపీకి బయలుదేరుతారు.
News December 15, 2025
హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవు: ప్రధాని అల్బనీస్

బాండీ బీచ్ వద్ద <<18561798>>ఉగ్రదాడి<<>> బాధితులకు అండగా ఉంటామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవని, దీటుగా ఎదుర్కొంటామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీఎం మృతులకు నివాళి అర్పించారు. ఉగ్రదాడి నేపథ్యంలో బాండీ బీచ్ వైపు వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. ఈ దాడిలో మరణాల సంఖ్య 16కు చేరగా 42 మంది గాయపడ్డారు.


