News August 31, 2024

వరంగల్: పలు రైళ్ల రద్దు

image

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. గుంటూరు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ SEP 23- OCT 8, విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ SEP 25 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7 వరకు అంతరాయం కలగనుంది.

Similar News

News September 29, 2024

పాలకుర్తి: ఇళ్లు ఖాళీ చేయించడం దారుణం!

image

పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధితులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేకపోవడంతో తన సొంత ఖర్చులతో 20 గ్రామాల్లో భూమి కొనుగోలు చేసి నిరేపేదలకు అందించామన్నారు.

News September 29, 2024

సంతాపం ప్రకటించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు

image

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణం పట్ల ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప రాజకీయ నాయకునిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దిన వారు ధన్యులని మంత్రులు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని మంత్రులు చెప్పారు.

News September 29, 2024

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత: మంత్రి సీతక్క

image

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వృద్ధులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.