News April 25, 2024

వరంగల్ పార్లమెంటరీ స్థానానికి 19 మంది నామినేషన్ దాఖలు

image

వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 సెట్లు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ అన్నారు. నామినేషన్ స్క్రూటీని భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 26 వరకు ఉంటాయన్నారు. ఏప్రిల్ 29 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.

Similar News

News January 9, 2025

మహబూబాబాద్: ABSF ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి 

image

మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

భద్రకాళి దేవస్థానంలో నేడు ధనుర్మాసం గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

News January 9, 2025

BHPL: భర్తపై భార్య కత్తితో దాడి.. సహకరించిన కొడుకులు 

image

ఆస్తి కోసం కొడుకులతో కలిసి భర్తపై భార్య దాడి చేసిన ఘటన మొగుపల్లి(M) బంగ్లాపల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ 6 ఎకరాల భూమిని వారి పేరు మీద రాయాలంటూ భార్య, ముగ్గురు కుమారులు తరచూ ఒత్తిడికి గురి చేశారు. ఈ విషయంపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం భార్య, ముగ్గురు కొడుకులు కత్తితో శ్రీనివాస్‌పై దాడి చేయగా ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది.