News April 7, 2025
వరంగల్: ప్రతిభ కనబరిచిన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు

ఏవీవీ కళాశాలలో జరిగిన తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్ అటెంప్ట్‌లో వరంగల్ నగరానికి చెందిన మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ కోచ్ మణికంఠ గడదాసుతో పాటు పలువురు అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. నేడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ విచ్చేసి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు.
Similar News
News April 18, 2025
‘గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి’

అనంతపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ భవనంలో గురువారం సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల తెగల వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
News April 18, 2025
సూపర్‌హిట్ మూవీ సీక్వెల్‌లో తమన్నాకు ఛాన్స్!

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌లో హీరోయిన్ తమన్నా భాటియా ఛాన్స్ కొట్టేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ హీరోలు అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా 2005లో రిలీజైన ‘నో ఎంట్రీ’లో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు నటించారు.
News April 18, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

✓ భూ సమస్యల పరిష్కారానికే భూభారతి: భద్రాద్రి కలెక్టర్ ✓ చర్ల: మావోయిస్టు ప్రాంతాల్లో ఎస్పీ చక్కర్లు ✓ బూర్గంపాడు: గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి ✓ సోలార్ జల వికాసంలో పైలెట్‌గా భద్రాద్రి జిల్లా ✓ అశ్వారావుపేటలో గుండెపోటుతో మహిళ మృతి ✓ కాంగ్రెస్‌కు BRS సభలో బుద్ధి చెబుతాం: రేగా ✓ కొత్తగూడెం కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన ✓ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టేకులపల్లి వాసికి చోటు.