News July 24, 2024
వరంగల్: బడ్జెట్‌పై అసంతృప్తి!
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వరంగల్ జిల్లాకు నిరాశే ఎదురైంది. విభజన హామీల్లో భాగంగా మంజూరైన ములుగు గిరిజన వర్సిటీకి ఈ పద్దులో నిధులు దక్కుతాయని ప్రజలు ఆకాంక్షించారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో దీనిపై ఎలాంటి ప్రస్తావన రాలేదు. వరంగల్ జిల్లాలో నిర్మిస్తున్న కాకతీయ మెగా జౌళి పార్కుకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. దీంతో వరంగల్ వాసులు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 28, 2024
MHBD: దీక్షదివస్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ కవిత
రేపు దీక్షదివాస్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే ఏర్పాట్లను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపటి దీక్షదివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఆమె వెంట డోర్నకల్ మాజీ MLA రెడ్యా నాయక్, తదితరులు ఉన్నారు.
News November 28, 2024
వరంగల్: నిన్నటిలాగే తటస్థంగా పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగే ఈరోజు తటస్థంగా ఉంది. గురువారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,840గా ఉంది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరకులను మార్కెట్‌కు తీసుకొని రావాలన్నారు. తేమ లేని సరకులు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
News November 28, 2024
కేయూ పట్ల సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు: ఎమ్మెల్యే
కాకతీయ యూనివర్సిటీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. సమకాలీన భారతదేశంలో సామాజిక సంస్థల ద్వారా ప్రపంచీకరణ, అభివృద్ధి, సామాజిక పరివర్తనపై యూనివర్సిటీలో నిర్వహించిన సెమినార్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో యూనివర్సిటీ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం దోహదడుతుందన్నారు.