News December 6, 2024

వరంగల్ భద్రకాళి అమ్మవారికి పూజలు

image

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు అభిషేకం నిర్వహించారు. నేడు అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడంతో తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

Similar News

News December 27, 2024

ALERT.. వరంగల్: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే మొదటి, ఐదవ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల(డిసెంబర్) 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.

News December 27, 2024

నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి.. UPDATE

image

బైకును కారు ఢీకొట్టడంతో <<14990389>>బీటెక్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్‌కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందగా.. గాయాలపాలైన శేషు, అభిరామ్‌ను ఎంజీఎంకు తరలించారు.

News December 27, 2024

జనగామ: ఈ లాయర్ ఎఫెక్ట్.. మాజీ కలెక్టర్, అధికారులపై FIR

image

జనగామ మాజీ కలెక్టర్ శివలింగయ్యతో పాటు మరో 11 మంది<<14987938>> అధికారులపై ఎఫ్ఐఆర్ <<>>నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో రాచకొండ ప్రవీణ్ కుమార్ అనే న్యాయవాది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీత పక్షాన వాదించి ఆమె ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆధారాలతో రుజువు చేశారు. దీంతో అధికారులపై అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.