News March 28, 2024

వరంగల్: మళ్లీ తగ్గిన పత్తి ధర 

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి రూ.7200 ధర పలికింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. మంగళవారం పత్తి ధర రూ.7,170 పలకగా.. బుధవారం రూ.7,310కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గింది. రేపటినుండి మార్కెట్‌కు వరుస సెలవులు రానుండడంతో ఈరోజు పత్తి తరలివస్తోంది.

Similar News

News April 21, 2025

WGL: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో WGL,HNK,JN,MHBD,BHPL,MLGలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

News April 21, 2025

వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

image

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.

News April 21, 2025

నాడు ‘పాకాల’.. నేడు ‘నర్సంపేట’

image

ప్రస్తుత నర్సంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాన్ని పాకాల నియోజకవర్గంగా పేర్కొనేవారు. మొదట్లో పాకాల తాలూకాగా తర్వాత నర్సంపేటగా రూపాంతరం చెందింది. 1952లో పాకాల ఎమ్మెల్యేగా ఏ.గోపాలరావు గెలుపొందారు. 1957లో నర్సంపేట ఎమ్మెల్యేగా కనకరత్నమ్మ గెలిచారు. దీంతో నర్సంపేట అంటే పాకాల.. పాకాల అంటే నర్సంపేటగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

error: Content is protected !!