News October 17, 2024

వరంగల్: మళ్లీ తగ్గిన పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారంతో పోలిస్తే నేడు పత్తి ధరలు తగ్గాయి. నిన్న క్వింటా కొత్త పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు (గురువారం) రూ.7,010కి పడిపోయింది. అలాగే పాత పత్తికి నిన్న రూ.7,450 ధర రాగా.. నేడు రూ.7,400కి తగ్గింది. పత్తి ధరలు తగ్గుతుండడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 25, 2024

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన వరంగల్ కలెక్టర్ సత్య శారద

image

గీసుగొండ మండల కేంద్రంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి రైతులు పండిస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను పండిస్తే నేలలు బాగుపడటమే కాకుండా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. రైతులు కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిబాబు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

News November 24, 2024

WGL: దీక్షా దివస్ సందర్భంగా ఇన్‌ఛార్జుల నియామకం

image

నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్షా దివస్ నిర్వహణలకు ఇన్‌ఛార్జులను నియమించినట్లు తెలిపారు.
భూపాలపల్లి-ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్,
వరంగల్-మాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి,
హనుమకొండ-ఎమ్మెల్సీ వాణిదేవి,
జనగామ-మాజీ MLA బిక్షమయ్యగౌడ్,
మహబూబాబాద్-మాజీ MLA కొండా బాలా కోటేశ్వర్‌రావు

News November 24, 2024

సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ 

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో కార్తీక మాసం ఆదివారం సందర్భంగా సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పూజా కార్యక్రమాలు అనంతరం సిద్దేశ్వరుడిని భక్తుల దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు అర్చకులు తెలిపారు.