News April 4, 2025

వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News April 12, 2025

హన్మకొండ: వడదెబ్బతో తాపీ మేస్త్రి మృతి

image

హన్మకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం(46) మృతి చెందారు. ఓ ఇంటి దాబాపై పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని మల్లేశం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI అశోక్ తెలిపారు. వేసవి దృష్ట్యా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు

News April 12, 2025

వరంగల్: బేకరీల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు

image

గొర్రెకుంట, ఇతర ప్రాంతాల్లో పలు బేకరీలలో ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బేకరీలలో నాణ్యమైన పదార్థాలనే వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని పదార్థాలను తయారీలో వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 12, 2025

జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడుతాయి: మంత్రి

image

నిరుద్యోగ సమస్యను పారద్రోలడానికి ఇలాంటి జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంత్రి కొండా సురేఖ నియామక పత్రాలను అందించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరై సంపూర్ణంగా వినియోగించుకోవడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

error: Content is protected !!